![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' బ్రహ్మముడి (Brahmamudi)'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-729లో.. దుగ్గిరాల ఇంటికి యామిని పంపించిన మనిషి వచ్చి అందరిని వివరాలు అడుగుతాడు. చెప్పండి మేడమ్.. ఈ కళావతి గారు మీ కోడలు అన్నారు.. మీ కోడలంటే? ఎలా కోడలు? అంటూ ఆరా తీస్తాడు. వెంటనే రాజ్ కూల్‌గా.. ఏంటి ఆఫీసర్ అలా అడుగుతావ్.. కళావతిగారు ఆవిడ మేనకోడలు.. ఏంటమ్మా నేను చెప్పింది నిజమే కదా అని రాజ్ అంటాడు. వెంటనే ఇందిరా దేవి.. కరెక్ట్‌గా చెప్పావ్ మనవడా మేనకోడలే అంటుంది. మరి మేనకోడలు అయితే వాళ్ల అమ్మా నాన్నలు ఎక్కడున్నారని యామిని మనిషి అడుగుతాడు. చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగింది మా కళావతి. అందుకే ఇక్కడే ఉంది.. వాళ్లు అక్కడ ఉంటారని ఇందిరాదేవి అంటుంది. హో.. అవునా.. మరి ఈవిడ ఓటర్ ఐడియా ఎక్కడుందని యామిని మనిషి అంటాడు. ఇక్కడుంటే అక్కడ ఉంటుందా అని ఇందిరాదేవి మాట్లాడుతుంది. నన్ను కన్ఫూజ్ చేయొద్దు.. అసలు ఈ కళావతి ఈ ఇంటి మనిషా.. ఆ ఇంటి మనిషా అని యామిని మనిషి అంటాడు. మా కళావతి అందరి మనిషి అని ప్రకాశం అంటాడు.
ఇక కాసేపటికి.. సరే మీరు వివరాలు రాసుకోవడం అయితే బయల్దేరండి అనడంతో ఆ వ్యక్తి వెళ్లిపోతాడు. అయ్యో మంచి అవకాశం పోయిందే అని రుద్రాణి చూస్తుంటే..అమ్మా రుద్రాణీ.. ఇలా రా నాన్నా నీతో చిన్న పని ఉంది.. రా అని ఇందిరాదేవి అంటుంది. అబ్బే లేదమ్మా నాకు చిన్న పని ఉంది వస్తానంటూ రుద్రాణి వెళ్లబోతుంది. వెంటనే స్వప్న.. అయ్యో అత్తా.. నీకు ఉన్న పనులన్నీ నేను చేసి పెడతాలే.. నువ్వు ముందు అమ్మమ్మగారితో వెళ్లమని అంటుంది. అవును అత్తా.. వెళ్లు.. నాన్నమ్మ అంత ప్రేమగా పిలుస్తుంది కదా? వెళ్లు అని కళ్యాణ్ అంటాడు. ఇక రుద్రాణి ముందుకు ఇందిరాదేవి వెళ్లి.. చేయి పట్టుకుని మరీ లోపలికి తీసుకుని వెళ్తుంది. అది చూసి అందరికీ సీన్ అర్థమై నవ్వుకుంటూ ఉంటారు. ఆ తర్వాత గదిలోకి వెళ్ళి రుద్రాణి చెంప వాయిస్తుంది ఇందిరాదేవి. ఆ చెంపదెబ్బ సౌండ్ బయటకు వినిపిస్తుంది. అందరు వింటారు.. రాజ్ విని ఆ శబ్దం ఏంటని అందరిని అడుగగా.. రుద్రాణిని చెంపవాయించిందని అందరికి అర్థమై మాకేం వినిపించలేదని యాక్ట్ చేస్తారు. అవునా నాకు వినిపించిందే అని రాజ్ అయోమయంగా చూస్తాడు.
మరోవైపు రాజ్ హాల్లో కూర్చుని కవ్య పట్టించుకోవడం లేదని బాధపడుతుంటే.. ఇందిరా దేవి, అపర్ణా ఇద్దరు తన దగ్గరికి వస్తారు. కావ్యకు ప్రపోజ్ చెయ్ రామ్.. తను ఒప్పుకుంటుందిలే అని ఇద్దరు బాగా బూస్టప్ ఇస్తారు. సరే నాన్నమ్మా ఈ రాత్రి బాగా ప్రిపేర్ అయ్యి రేపు తనకు ప్రపోజ్ చేస్తాను సరేనా అనేసి రాజ్ ఇంటికి బయలుదేరతాడు. తీరా రాజ్ వెళ్లాక.. రేపు రాజ్ ప్రపోజ్ చేసే విషయం గురించి ఇందిరాదేవి, అపర్ణా మాట్లాడుకుంటూ ఉంటే అది రాహుల్ వింటాడు. వెంటనే అతను రుద్రాణి దగ్గరకు వెళ్లి.. విషయం చెప్పాలి అనుకుంటే ఆమె చెంపలు దాచుకుంటుంది. నా దగ్గర దాచుకుని ఏం ఉపయోగం లేదులే.. అమ్మమ్మ నిన్ను కొట్టిందన్న విషయం అందరికి తెలిసిపోయింది. దాన్ని వదిలేసి నేను చెప్పేది విను.. రేపు కావ్యకు రాజ్ ప్రపోజ్ చేయబోతున్నాడు. అదే జరిగితే తర్వాత పెళ్లి అంటారు. రాజ్ ఇక్కడికే అల్లుడిలా ఎంట్రీ ఇస్తాడు దీన్ని ఎలాగైనా ఆపాలని రాహుల్ అంటాడు. దాంతో వెంటనే యామినీకి కాల్ చేస్తుంది రుద్రాణి. దీన్ని నువ్వే ఆపాలనే విషయం యామినికి చెప్పేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |